Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జీల్లో ఎంజాయ్ కోసమైతే గోవాకు రావొద్దు : సీఎం ప్రమోద్ సావంత్

Goa
Webdunia
శుక్రవారం, 15 మే 2020 (17:49 IST)
దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. అయినప్పటికీ ఈ వైరస్ నుంచి విముక్తి పొందిన రాష్ట్రాల్లో గోవా ఒకటి. కరోనాను బాగా కట్టడి చేసిన రాష్ట్రంగా గోవా గుర్తింపు పొందింది. దీంతో గోవాలో పర్యాటకుల సందర్శనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకునేందుకు కూడా పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది.
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ, సరదాగా గడపడానికి, లాడ్జీల్లో ఎంజాయ్ చేసేందుకు అయితే తమ రాష్ట్రానికి రావొద్దని కోరారు. అలా వచ్చినవారిని తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారైంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. 
 
న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలులో 720 మంది మార్గావ్ వరకు టికెట్లు బుక్‌చేసుకున్నారని, వారిలో గోవాకు చెందినవారు ఒక్కరు కూడా లేరనే విషయాన్ని గ్రహించినట్టు తెలిపారు. 
 
ఢిల్లీలో ఈ రోజు బయల్దేరిన ప్రత్యేక రైలు రేపు తిరువనంతపురం చేరుకోనుంది. మార్గావ్‌లో రైలు ఆపకూడదని తాము ఇప్పటికే రైల్వేశాఖను కోరామని తెలిపారు. ఇలా వచ్చేవారిలో గోవా పౌరులతోపాటు, రాష్ట్రానికి చెందనివారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచుతామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments