Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కలకలం : రాజకుటుంబంలో 150 మందికి కరోనా

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:48 IST)
సౌదీ అరేబియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. సౌదీ రాజకుటుంబంలోకి కరోనా వైరస్ ప్రవేశించి, సుమారు 150 మంది రాజకుటుంబీకులు ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వార్తలు అంతర్జాతీయ పత్రికల్లో వస్తుండటంతో కలకలం రేపుతోంది. 
 
ప్రపంచ దేశాలతో పాటు.. సౌదీలో కూడా కరోనా వైరస్ వ్యాపించిన విషయం తెల్సిందే. 33 మిలియన్ల మంది ప్రజలు నివసించే సౌదీలో ఇప్పటి వరకు 2,932 కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. దీంతో ఆ దేశంలో కూడా లాక్‌డౌన్ ప్రకటించారు. అలాగే, రియాద్ గవర్నర్ అయిన సీనియర్ యువరాజు ఫైసల్ బిన్ బండార్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ (70) కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అలాగే, రాజకుటుంబానికి చెందిన మరో 12 మందికిపైగా చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. 
 
అదేవిధంగా, మరికొంతమందినికి ఈ వైరస్ సోకినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. రాజకుటుంబీకులు ఒక్కొక్కరిగా ఈ వైరస్ బారినపడుతుండటంతో వైరస్ బారినపడే రాజకుటుంబ సభ్యులకు చికిత్స చేసే కింగ్ ఫైసల్ ఆసుపత్రిలో 500 పడకలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందాయని, ఇది బయటకు రావడంతోనే వారు కరోనా బారినపడిన విషయం బయటకు వచ్చిందని పలు పత్రికలు పేర్కొన్నాయి.
 
ఎన్ని కేసులు అనే విషయం తెలియదని, కాకపోతే హై అలెర్ట్‌గా ఉండాలన్నది మెసేజ్ సారాశంగా పేర్కొంది. వేలాది మందిగా వున్న సౌదీ రాజులలో చాలామంది క్రమం తప్పకుండా యూరప్ పర్యటనలకు వెళ్తుంటారని, ఈ క్రమంలోనే వారికి కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందని, వారి ద్వారా దేశంలోకి ప్రవేశించి రాజకుటుంబం మొత్తానికి సోకి ఉంటుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments