ముంబైలో కరోనా విజృంభణ.. డిసెంబర్ 31వరకు స్కూళ్లు మూసివేత

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (13:36 IST)
ముంబైలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో డిసెంబర్ 31వ తేదీ వరకు స్కూళ్లను మూసివేయనున్నారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేస్తున్నట్లు ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ తెలిపారు.

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో స్కూళ్లను తెరవడం లేదన్నారు. వాస్తవానికి సోమవారం నుంచి ముంబైలో స్కూళ్లను తిరిగి ఓపెన్ చేయాల్సి ఉన్నది. అయితే బీఎంసీ పరిధిలో ఉండే స్కూళ్లకు మాత్రం ఆంక్షలను పెంచేశారు. 
 
కోవిడ్ కేసులు పెరగడంతో ముంబై మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు నవంబర్ 23వ తేదీన స్కూళ్లను తెరవడం లేదని మేయర్ తెలిపారు.

మరోవైపు కరోనా వ్యాక్సిన్స్ ట్రయల్స్ ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌.. కోవాగ్జిన్‌ టీకా ట్రయల్ డోసు తీసుకున్నారు. అంబాలాలోని ఓ హాస్పిటల్‌లో ఆయన ఇవాళ కోవిడ్ టీకాను వేయించుకున్నారు. 
 
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను రూపొందిస్తోంది. అయితే శుక్రవారం కోవాగ్జిన్‌ మూడవ దశ ట్రయల్స్ దేశంలో ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా మంత్రి అనిల్ విజ్‌.. వాలంటీర్ రూపంలో కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments