Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కొత్తగా 5 వేల కరోనా కేసులు

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (11:17 IST)
తెలంగాణలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,555 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,12,563 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,824గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 37,037 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 24,156 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 743 మందికి క‌రోనా సోకింది.
 
దేశంలో కొత్తగా 2.61 లక్షల కరోనా కేసులు  
దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ మామూలుగా లేదు. నిన్న‌ కొత్త‌గా 2,61,500 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,38,423  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,88,109కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 1,501  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,77,150కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,28,09,643 మంది కోలుకున్నారు. 18,01,316 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,26,22,590 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,65,38,416  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,66,394 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments