Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా పాజిటివ్ కేసులపై తాజా బులిటెన్...

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (11:18 IST)
దేశంలో గత 24 గంటల్లో 39,070 క‌రోనా కొత్త పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 43,910 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే... గడిచిన 24 గంటల్లో 491 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,27,862కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,10,99,771 మంది కోలుకున్నారు. 
 
4,06,822 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. శనివారం 55,91,657 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,68,10,492 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.
 
మరోవైపు, తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గింది. శనివారం వెల్లడైన మీడియా బులిటెన్ మేరకు గడచిన 24 గంటల్లో 1,05,201 కరోనా పరీక్షలు నిర్వహించగా, 569 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 657 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. 
 
తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 64, వరంగల్ అర్బన్ జిల్లాలో 51, ఖమ్మం జిల్లాలో 40 కేసులు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 
 
ఇప్పటివరకు 6,48,957 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,36,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,582 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,823కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments