Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 282 కేసులు.. ఒకరు మృతి

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (19:05 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8,80,712కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,092 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 3,700 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,69,920 మంది రికవరీ అయ్యారు.
 
మహమ్మారి కరోనా తగ్గిపోతుందని సంబరపడుతున్న రాష్ట్రంలో 'కరోనా స్ట్రెయిన్‌' కలవరపెడుతోంది. దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తుతోంది. బ్రిటన్‌తో పాటు మరో నాలుగైదు దేశాల్లో తన ప్రతాపం చూపుతుండటంతో యూకే నుంచి వస్తున్నా విమానాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 
 
బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ 70 శాతం ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదయినా కరోనా ప్రభావం కేవలం 20 శాతం ఉండగా, తాజా వైరస్‌ ప్రభావం ఇంతకు మూడు రెట్లకుపైగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments