Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్.. 18 మందికి పాజిటివ్

Advertiesment
తెలంగాణలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్.. 18 మందికి పాజిటివ్
, శనివారం, 26 డిశెంబరు 2020 (17:40 IST)
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ తెలంగాణలో కలకలం రేపుతంది. తాజాగా శనివారం మరో ఇద్దరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంభిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1216 మంది యూకే నుండి తెలంగాణకు వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో శనివారం మరో ఇద్దరికీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి చెందిన వారు. మొత్తం ఇప్పటివరకు 18 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్‌గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి.
 
18 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు లో ఉంచి 18 మందికి 79 మందికి అతిసన్నిహితంగా ఉన్న వారిని గుర్తించారు. వారిని క్వారంటైన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేస్తున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిపబ్లిక్ డే వేడుకలు.. కవాతులో పాల్గొన్న 150 మంది సైనికులకు పాజిటివ్