Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరం.. మలేషియా

Webdunia
బుధవారం, 7 జులై 2021 (13:50 IST)
డెల్టా రకం కంటే కరోనా లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో లాంబ్డా వేరియంట్ ను గుర్తించారు. యూకేలోనూ ఆరు లాంబ్డా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.
 
యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు చెప్పారు.పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనావైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు.
 
లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.యూకేలో వెలుగుచూసిన ఆరు లాంబ్డా కరోనా వైరస్ వేరియంట్ విదేశీ ప్రయాణాలతో్నే వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. లాంబ్డా కరోనా వైరస్ వేరియంట్ ప్రవర్తన, ఉత్పరివర్తనాల ప్రభావంపై ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని యూకే ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం