Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ఐటీ క్యాపిటల్‌లో కొత్త కరోనా వేరియంట్

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (16:52 IST)
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరులో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. ఏవై.4.2 అనే రకం వైరస్ కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, ఇదే తరహా వైరస్ కేరళ రాష్ట్రంలో కొత్తగా 7 వేల మందికి కొవిడ్​ సోకింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 482 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో దేశంలో ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. 
 
కర్నాటకలో సోకిన ఏడుగురు బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగతా నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారని అధికారులు వివరించారు. ఈ వేరియంట్ బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
 
 ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించనుందని చెప్పారు. ఏవై.4.2 రకం అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments