తెలంగాణాలో మరో కొత్త రాజకీయ పార్టీ

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (16:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకానుంది. మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్‌ ఈ పార్టీని ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమైవున్నారు. ఇందులోభాగంగా, ఆయన బుధవారం తన తన మద్దతుదారులు, అనుచరులతో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో సమావేశమయ్యారు. 
 
ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్‌తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు వినయ్.. ఈ ఏడా డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును, జెండా, అజెండాను ప్రకటిస్తామంటున్న వినయ్‌ కుమార్.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.
 
రాజకీయ ప్రయాణంలోకి నన్ను డాక్టర్ మిత్ర లాగారని గుర్తుచేసుకున్న ఆయన… 2014 జులై 27న మాసాయిపేట రైల్ ప్రమాదం నన్ను కలచివేసిందని తెలిపారు. ఇక, చదివించటం ప్రభుత్వ బాధ్యత కాదా..? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టాండర్డ్స్‌ కూడా లేవని విమర్శించారు. 
 
ఇప్పటికే మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. కొత్త పార్టీ పెట్టకపోయినా బీఎస్పీలో చేరి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పనిచేస్తున్నారు.. మరోవైపు.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల కూడా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించి.. పాదయాత్రను కూడా చేపట్టారు. ఇప్పుడు డాక్టర్ వినయ్‌ కుమార్‌ కూడా పొలిటికల్‌ పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌గా మారిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments