కాన్పూర్‌కు జికా వైరస్ ముప్పు! పెరుగుతున్న కేసులు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (13:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు జికా వైరస్ ముప్పు పొంచివుంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్ర‌స్తుతం యూపీలో కొత్తగా మరో 13 జికా వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 79 జికా కేసులు న‌మోదైన‌ట్లు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
 
ముఖ్యంగా కాన్పూర్ జిల్లాలో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న‌ట్టు వైద్య అధికార బృందం గుర్తించింది. దీంతో వ్యాప్తి క‌ట్ట‌డికి వేగంగా చ‌ర్య‌లు చేప‌ట్టెందుకు కృషి చేస్తోంది. వ్యాధి సోకిన వారితో ద‌గ్గ‌ర‌గా ఎవ‌రు ఉన్నారు అని గుర్తించే ప‌నిలో ప‌డింది. ఏదైమైన జికా వైర‌స్ పెరుగుద‌ల అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.
 
కేసులు పెరుగుతుండటంతో ప్ర‌భుత్వం కోవిడ్ వ్యాప్తి క‌ట్ట‌డికి చర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే ఆశా కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ వెళ్లి వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. జిల్లాలో మొత్తం 150 బృందాలు శానిటైజేషన్, ఫాగింగ్ చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్

Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ

రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

తర్వాతి కథనం
Show comments