దేశంలో 73 రోజుల కనిష్టానికి కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (10:19 IST)
దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
కొత్తగా 62480 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవి 73 రోజుల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అలాగే, కొత్తగా 88,977 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 1,587 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారని తెలిపింది. 
 
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. మొత్తం 2,85,80,647 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్‌ కేసులున్నాయని వివరించింది. టీకా డైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 26,89,60,399 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వరుసగా 36వ రోజు రోజువారీ కొత్త కేసులను రికవరీలు మించిపోయాయని చెప్పింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 96.03 శాతానికి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinath Maganti: శోభనం రోజే వాంతి చేసుకుంటే మెన్షన్ హౌస్ మల్లేష్ ఏం చేశాడు?

Heba Patel: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రేపు ఉదయం 10 గంటలకు

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments