Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి దాటిన ఒమిక్రాన్ కేసులు - ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:13 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయింది. తెలంగాణాలో కొత్తగా మరికొన్ని కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా, ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర మారింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే, దేశంలో ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయి 1270కు చేరింది. అయితే, ఈ వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 374 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, ఒమిక్రాన్ కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారడం ఇపుడు ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే పాజిటివ్ కేసులు ఏకంగా 450కు చేరుకున్నాయి. అలాగే, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణాలో 62 చొప్పున నమోదై వున్నాయి. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 16,764కు చేరాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,48,38,804కు చేరుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

తర్వాతి కథనం
Show comments