Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల అరకోటి...

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (10:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డూఅదుపులేకుండా పోతోంది. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య అరకోటికి దాటిపోయాయి. గత 24 గంటల్లో దేశంలో 90,123 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,290 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 82,066కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 39,42,361 మంది కోలుకున్నారు. 9,95,933 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 5,94,29,115 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,16,842 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణాలో కొత్తగా మరో 2273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం మొత్తం 55,636 మందికి పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,62,844 మంది ఈ మహమ్మారి బారినపడినట్టు నిర్ధారణ అయింది. 
 
ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌‌లో పేర్కొంది. ఇక, గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందడంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా మరణాల సంఖ్య 996కు చేరింది. కరోనా బారి నుంచి మంగళవారం ఒక్కరోజే 2,260 మంది కోలుకోవడంతో ఈ మహమ్మారి బారినుంచి మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,31,447కు పెరిగింది. 
 
రాష్ట్రంలో ఇంకా 30,401 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 23,569 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు 22,76,222 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments