15 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14306  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 443 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. 
 
ప్రస్తుతం దేశంలో 1,67,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 239 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు, దేశంలో అత్యధిక కేసులు కేరళలో నమోదయ్యాయి. 
 
కేరళలో గత 24 గంటల్లో 8,538 కేసులు నమోదు కాగా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కి పెరిగాయి. ఇప్పటివరకు 4,54,712 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
 
మరోవైపు, ఆదివారం వెల్లడించిన ప్రకటన మేరకు తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు గుర్తించారు.
 
వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
 
అదే సమయంలో 168 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,377 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,950 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,947కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments