Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-బ్రిటన్ విమానాలు బంద్.. మరికొంత కాలం ఇదే తంతు

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (09:53 IST)
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 31 వరకు భారత్-బ్రిటన్ మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన భారత ప్రభుత్వం దానిని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించింది. దేశంలోనూ కొత్త వైరస్ జాడలు గుర్తించడంతో నిషేధాన్ని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి పేర్కొన్నారు. 
 
వైరస్‌ను కట్టడి చేయడంతోపాటు ఇరు దేశాల మధ్య విమాన సేవలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వందే భారత్ మిషన్ ద్వారా 42 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వీరిలో కేరళకు చెందిన 8 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. 
 
తెలంగాణకు 1,84,632 మంది వచ్చినట్టు పేర్కొన్నారు. కరోనాకు ముందు 40 దేశాలకు రాకపోకలు సాగించిన ఎయిర్ ఇండియా కరోనా సమయంలో 75 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments