భారత్‌లో 20కి చేరిన మరణాలు.. మొత్తం కేసులు 727

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (09:58 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారానికి దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 727కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా 20కి చేరింది. ఒక్క గురువారం రోజే కొవిడ్-19తో  ఏడుగురు రోగులు మరణించారు. 
 
దేశవ్యాప్తంగా ఒక్కరోజే మరో 71 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు బయటపడటంతో దేశంలో కొవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య 727కు పెరిగింది. కరోనా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ఇప్పుడు ఇటలీ, చైనాలను అధిగమించింది. గత సంవత్సరం డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగులోకి రాగా, ప్రస్తుతం చైనాలో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంది. 
 
ఆపై ఇటలీలో కేసుల సంఖ్య వందల నుంచి వేలకు పెరుగగా, ఇప్పుడా స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అమెరికాలో గురువారం నాటికి 83 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5 లక్షలకు చేరగా, 23,293 వేల మంది ఇప్పటివరకూ మరణించారు. అమెరికాలో మరణాల సంఖ్య 1,178కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments