ఉద్యోగులను వెంటాడుతున్న కరోనా, కోనసీమలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:22 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్న అమలాపురం డివిజన్లో పది మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా, రాజోలు ప్రభుత్వ స్కూలులో ఏడుగురు ఉపాధ్యాయులకు కూడా కరోనా పోసిటీవ్ అని తేలింది.

తాజాగా అల్లవరం మండల తహశీల్దార్ సహా మరో నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కోనసీమలో గత ఐదు రోజుల నుంచి కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. కాగా, మిగతా డివిజన్ల కంటే అమలాపురం డివిజన్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు వెల్లడించారు.

ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలలో జన సమూహం ఏర్పడటంతో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. స్కూళ్లలో ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకుతోందని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సోకిన ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసామని, కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో వసంతరాయుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments