Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటివారే కరోనా వైరస్‌ను విపరీతంగా అంటించేస్తున్నారు

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:50 IST)
కరోనా బాధితుల్లో 90 శాతం మంది సాధారణ వైద్యంతోనే కోలుకుంటున్నారని, ఒక్క శాతం రోగులకు మాత్రమే వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించాల్సి వస్తోందని ఐసీఎంఆర్‌ (భారత వైద్య పరిశోధన సంస్థ) పేర్కొంది. 
 
దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలపై ఐసీఎంఆర్‌ చేసిన అధ్యయన వివరాలను సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ గంగా కేడ్కర్‌ తెలిపారు. 
 
1. దేశంలో బుధవారం ఉదయం వరకు నిర్వహించిన పరీక్షల్లో 19,484 మందికి పైగా కోవిడ్‌–19 వైరస్‌ సోకినట్లు తేలింది. కరోనా బారిన పడిన వారిలో 3,870 మంది కోలుకున్నారు.. 640 మంది మరణించారు.
 
2. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధక శక్తి అతి తక్కువగా ఉన్న వారు మాత్రమే మరణిస్తున్నారు.
 
3. దేశంలో కోవిడ్‌–19 వైరస్‌ సోకిన 69 శాతం మందిలో కరోనా వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించలేదు. అయితే వీరి ద్వారానే ఎక్కువ మందికి కరోనా వ్యాపిస్తోంది.
 
4. కోవిడ్‌–19 సోకిన 14 రోజుల్లోపు కరోనా లక్షణాలు బయటపడతాయి.వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో నాలుగైదు రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉన్న వారిలో 14 రోజుల తర్వాత కూడా బయటపడవు.
 
5. కోవిడ్‌–19 బారిన పడినప్పటికీ 69 శాతం మందిలో కరోనా లక్షణాలు కన్పించకపోవడానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటమే.
 
6. మన దేశంలో కోవిడ్‌–19 సోకినా కరోనా లక్షణాలు కన్పించని వారి నుంచి ఆ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని.. అది ఎంత శాతం అన్నది తేలాల్సి ఉంది.
 
7. చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తేసిన తర్వాత చేసిన పరీక్షల్లో 78 శాతం మందికి కోవిడ్‌–19 వైరస్‌ సోకినట్లు తేలినా కరోనా లక్షణాలు కన్పించలేదు. అయితే వీరి ద్వారానే 62 శాతం మందికి వైరస్‌ వ్యాపించింది. ఇలాంటి వారి సంఖ్య సింగపూర్‌లో 48 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments