Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేయించుకోవాలి?

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (15:07 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లు త్వరలోనే వినియోగానికి రానున్నాయి. ఈ వ్యాక్సిన్ల కోసం దేశంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకాల కోసం ప్రజలు ముందుగా రిజిస్టర్‌ చేసుకొనేందుకు వీలుగా కొ-విన్‌ అనే వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలోనే మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ రెండు మార్గాల ద్వారా సామాన్యులు నేరుగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 
 
ముందుగా కొ-విన్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి. సరైన నంబర్‌ అయితే వెంటనే మీ పేరు, శాశ్వత చిరునామా తదితర వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. ఆ వెంటనే ఆధార్‌ నంబర్‌తో నమోదై ఉన్న మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్టు చూపిస్తుంది. 
 
ఆధార్‌ కార్డుపై ఉన్న చిరునామాలు లేనివారు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, పుట్టిన తేదీలను స్వయంగా కూడా ఎంటర్‌ చేయవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత ‘డెమో అథెంటికేషన్‌' అనే ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఆకుపచ్చ టిక్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టు చూపిస్తుంది. 
 
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే ఎప్పుడు? ఎక్కడ? మీకు టీకా వేస్తారు అనే వివరాలతో కూడిన సందేశం మీ మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. కొ-విన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు వేస్తారు. నేరుగా టీకా కేంద్రానికి వెళ్లినా వేయరు. 
 
కొ-విన్‌లో పేరు ఎప్పుడు నమోదు చేసుకోవాలి?
ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. సామాన్య ప్రజల వివరాల నమోదుపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎవరికి వారు ఈ పోర్టల్‌ లేదా యాప్‌లో పేరును స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలి. దానిని బట్టి టీకా వేసే సమయాన్ని కేటాయిస్తారు.
 
టీకా సెషన్‌ను ఎవరు.. ఎలా నిర్ణయిస్తారు?
ఏయే కేంద్రాల్లో టీకాలు ఎప్పుడు వేయాలి? ఎన్ని సెషన్లలో ఎంతమందికి వేయాలన్న అంశాలను జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుంది. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాయంతో కలెక్టర్‌ టీకా సెషన్‌ను ఖరారు చేస్తారు. టీకా కేంద్రాలు, టీకాలు వేసే సిబ్బంది, సూపర్‌వైజర్లు, టీకా వేసుకొనేవారు ఎవరు అనే విషయాలపై తుది నిర్ణయం కలెక్టర్‌దే. 
 
టీకా కేంద్రం ఎలా ఉంటుంది?
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను టీకాలు వేసే సెషన్‌ సైట్‌లుగా ఉపయోగిస్తారు. మారుమూల ప్రాంతాల్లో అయితే పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లను కూడా ఇందుకోసం వాడుకొంటారు. టీకా కేంద్రంలో మూడు గదులు ఉంటాయి. 1. వెయిటింగ్‌ రూం, 2. వ్యాక్సినేషన్‌ రూం, 3. అబ్జర్వేషన్‌ రూం. టీకా వేసుకున్న తర్వాత అబ్జర్వేషన్ రూంలో కొంత సేవు ఉంచుతారు. ఈలోపు అతనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించని పక్షంలోనే ఇంటికి పంపుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments