Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సిన్‌కు తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:14 IST)
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి మెలకువలు పాటించాలనే దానిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాంటిదే ఈ డౌట్ కూడా. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
టీకా వల్ల దీర్ఘకాలిక లేదా స్వల్ప కాలిక సమస్యలు ఏమైనా ఉత్పన్నం అవుతాయా అనే దానిపై కేంద్ర ఆరోగ్యశాఖ మాత్రం దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. టీకా తీసుకున్న వారు సెక్స్‌లో పాల్గొనడం సురక్షితమా లేదా అన్న అంశాన్ని ఆ శాఖ స్పష్టం చేయలేదు. కానీ కొందరు నిపుణులు ఈ అంశంపై స్పందించారు. స్త్రీ, పురుషులిద్దరూ కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న తర్వాత కొన్ని వారాల పాటు కండోమ్‌లను వాడాలని సూచిస్తున్నారు.
 
ఘజియాబాద్‌కు చెందిన డాక్టర్ దీపక్ వర్మ దీనిపై కొంత వివరణ ఇచ్చారు. సార్స్ సీవోవీ2 వైరస్ అనేది కొత్తది అని, ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకే టీకాలను అభివృద్ధి చేశారని, ఆ టీకాలు వాడడం వల్ల ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల వస్తాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.
 
శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో చెప్పలేమని, కానీ రెండవ డోసు తీసుకున్న మూడు వారాల వరకు కండోమ్‌లను వాడడం సురక్షితమని డాక్టర్ వర్మ తెలిపారు. ఎందుకంటే శృంగార సమయంలో శరీర ద్రవాలు కాంటాక్ట్‌లోకి వస్తాయని, అందుకే ముందు జాగ్రత్తగా కండోమ్‌లు వాడడం ఉత్తమం అని తెలిపారు. మహిళలు గైనకాలజీ డాక్టర్లను సంప్రదించడం బెస్ట్ అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం