Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ట్రావెల్ బబుల్‌ విమాన సర్వీసులు.. ఐతే..?

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (21:19 IST)
సింగపూర్-హాంకాంగ్ మధ్య వచ్చే నెల 26 నుంచి ఎంపిక చేసిన విమానాలతో కరోనా వైరస్ ట్రావెల్ బబుల్‌ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నిజానికి గతేడాదే ఈ రెండు నగరాల మధ్య క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ కారిడార్ ప్రారంభం కావాల్సి ఉంది. 
 
అయితే, హాంకాంగ్‌లో అప్పట్లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలు కావడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చకుండా పోయింది. మూలనపడిన ఈ ప్రతిపాదనను మళ్లీ పట్టాలెక్కించాలని భావించిన ఇరు ప్రభుత్వాలు అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశాయి.
 
వచ్చేనెల 26న రెండు వ్యాపార కేంద్రాల మధ్య తొలి విమానం 200 మంది ప్రయాణికులతో బయలుదేరుతుంది. జూన్ 10 నుంచి ప్రతి రోజూ రెండు విమానాలు నడుస్తాయి. ఈ మేరకు కేథీ పసిఫిక్-సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. 
 
హాంకాంగ్ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులు ఫైజర్-బయోఎన్‌టెక్, సినోవక్ వ్యాక్సిన్లలో ఏదో ఒకదానిని రెండు డోసులు తప్పనిసరిగా తీసుకుని ఉండాలి. 
 
అయితే, సింగపూర్ నుంచి వెళ్లే ప్రయాణికులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకుని ఉండాల్సిన అవసరం లేదు. అయితే, డిపార్చర్, అరైవల్ సమయంలో మాత్రం నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
 
కరోనా కారణంగా మూతపడిన విమానయానాన్ని తిరిగి గాడినపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు క్వారంటైన్-ఫ్రీ బబుల్స్ ప్రారంభిందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 
 
తైవాన్, పలావు దేశాలు గత నెలలో డెడికేటెడ్ ట్రావెల్ బబుల్ ప్రారంభించగా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా దీనిని అనుసరించాయి. 
 
తాజాగా, సింగపూర్, హాంకాంగ్ దేశాల మధ్య క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ ప్రారంభం కానుంది. అయితే, ట్రేసింగ్ సాధ్యం కాదని ఇన్ఫెక్షన్లు ఒక వారంలో ఐదుకు మించితే మాత్రం ఈ ట్రావెల్ బబుల్‌ను రెండు వారాల పాటు రద్దు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments