Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేషెంట్లు ప్రేమికులయ్యారు... డిశ్చార్జ్ అయ్యాక పెళ్లి చేసుకున్నారు..

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (14:17 IST)
అవును కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆ ఇద్దరు ప్రేమికులయ్యారు. చికిత్సకు అనంతరం నెగటివ్ రావడంతో పెద్దల సమ్మతంతో వివాహం చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. 
 
ఇద్దరి బెట్లు కూడా పక్కపక్కనే వుండటంతో.. వీరిద్దరి మధ్య మాటలు కలవడంతో స్నేహితులయ్యారు. ఆపై ప్రేమికులుగా మారారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ టెస్టులు చేస్తే ఇద్దరికి నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తమ ప్రేమ కథను తల్లిదండ్రులకు చెప్పారు. అబ్బాయి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 
 
అమ్మాయి కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. అంతే కాదు ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడం, అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తుండడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. దీంతో ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి ప్రేమకథ మొత్తం పదిరోజుల వ్యవధిలోనే నడిచింది. పెళ్లి కూడా అయ్యింది. ప్రస్తుతం ఈ కరోనా ప్రేమకథ చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments