Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిన కరోనా .. మాస్క్ లేకపోతే ఫైన్

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (12:05 IST)
దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2 వేల 527 కేసులొచ్చాయి. 33 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరగగా, మరణాలు తగ్గాయి. యాక్టివ్ కేసులు 15వేల 79కి పెరిగాయి. గత 24 గంటల్లో 1,656 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 500 జరిమానా విధిస్తామని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ శుక్రవారం తెలిపారు.
 
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించామని రాధాకృష్ణన్ తెలిపారు. ఏప్రిల్ 21న తమిళనాడులో 39 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఆ సంఖ్య 34,53,390కి చేరుకుంది.
 
అటు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 38,025గా ఉంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసి ఆదేశాలు జారీ చేసింది..లేనట్లైతే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments