కరోనావైరస్ పాల ప్యాకెట్ల ద్వారా వస్తుందా?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (23:46 IST)
ఇపుడు కరోనావైరస్ ఏ వస్తువు ద్వారా వస్తుందోనన్న భయం చాలామందిలో వుంది. కూరగాయలు తెచ్చుకుని వాటిని పసుపు, ఉప్పు కలిపిన నీళ్లలో వేసి కొందరు కడుతున్నారు. మరికొందరు శానిటైజర్లతో కడిగే ప్రయత్నం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్నింటికీ మించి పాల ప్యాకెట్లతో కరోనావైరస్ వస్తుందోమోనన్న భయంతో చాలామంది వాటిని శానిటైజర్ కలిపిన నీళ్లలో వేసి కడిగి తీసుకుంటున్నారు. ఐతే పాల ప్యాకెట్లను ఇలా శానిటైజర్‌తో కడగడం ఆరోగ్యానికి ప్రమాదం.
 
మరేం చేయాలి? అంటే... పాల ప్యాకెట్లను తీసుకున్న తర్వాత మీ చేతులను సబ్బుతో బాగా శుభ్రంగా కడగండి. ఆ తర్వాత పాల ప్యాకెట్‌ను నీటిలో కడగండి. ప్యాకెట్లను శానిటైజర్లతో కాని డిటర్జెంట్‌తో కాని కడగాల్సిన పనిలేదు. కడిన తర్వాత ఆ నీళ్లు పాల పాత్రలోకి రాకుండా ఉండటానికి ప్యాకెట్‌ను కాసేపు పక్కన పెట్టేయండి. ఈ పాల ప్యాకెట్ పైన వున్న నీళ్లను తుడిచేందుకు ఇంట్లోని కిచెన్ టవల్‌ను ఉపయోగించవద్దు.
 
కొద్దిగా నీళ్లు ప్యాకెట్ పై నుంచి పోయాక మళ్లీ మీ చేతులను కడుక్కొని ప్యాకెట్‌ను జాగ్రత్తగా కత్తిరించి పాత్రలో పోసి పాలను వేడి చేయండి. అంతే పాలు సురక్షితంగా మీకు చేరినట్లే. ఐతే పాల ప్యాకెట్లు వేసేవారు మాస్కులు కట్టుకుంటున్నారో లేదో చూడండి. ఒకవేళ వారు ధరించనట్లయితే వాటిని ధరించాలని చెప్పండి. అలాగే ప్యాకెట్ తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Tickets reduced: తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరలు తగ్గించబడ్డాయి

Siddhu Jonnalagadda: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ చిత్రం ప్రకటన

టెలివిజన్ సీరియల్ నటి నందిని ఆత్మహత్య.. చున్నీతో కిటికీకి ఉరేసుకుని..?

Madhavilatha: సాయిబాబా దేవుడు కాదు... సినీనటి మాధవీలతపై కేసు నమోదు

షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు

పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments