Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ - ఈ రోజు కేసులు ఎన్నంటే...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:22 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుంది. ముఖ్యంగా, ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 13,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 41,771 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగు చూశాయి. 
 
ఈ కేసుల్లో అత్యధికంగా కడప జిల్లాలో 2,031, కర్నూలులో 1,835, విశాఖపట్టణంలో 1,349, గుంటూరులో 1,342, ప్రకాశంలో 1,259, తూర్పుగోదావరిలో 1,066, నెల్లూరు జిల్లాలో 1,007 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నుంచి 10,290 మంది కోలుకోగా, 9 మంది మరణించారు. 
 
అదేవిధంగా తెలంగాణాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 97,549 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 3,944 మందికి ఈ వైరస్ సోకింది. 2,444 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,372, మేడ్జల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డిలో 259, ఖమ్మంలో 135, సంగారెడ్డిలో 120, హన్మకొండలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్ధిపేట జిల్లాలో 104, కొత్తగూడెం జిల్లాలో 101 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments