Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాలి

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:15 IST)
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబుతోన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం రాష్ట్రంలో కొత్త‌గా 13 జిల్లాలు ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు.
 
హామీ ఇచ్చిన విధంగా ప్ర‌తీ పార్ల‌మెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. అనంత‌పురం జిల్లాలో హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందింది. వ్యాపార‌ప‌రంగా, వాణిజ్య‌ప‌రంగా, పారిశ్రామికంగా అన్ని ర‌కాలుగా ఎంతో అభివృద్ధి చెందిన విష‌యం అంద‌రికీ తెలిసిందేనని బాలయ్య చెప్పుకొచ్చారు.
 
హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని కోరారు బాల‌య్య‌. హిందూపురం ప‌ట్ట‌ణ ప‌రిస‌రాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటు, భ‌విష్య‌త్ అవ‌స‌ర‌మైన భూమి పుష్క‌లంగా ఉంద‌ని.. కానీ, జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్ద‌ని కోరారు.
 
హిందూపురం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి.. వారి చిరికాల కోరికైన హిందూపురం ప‌ట్ట‌ణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments