తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల వివరాలను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు కొత్తగా 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే, కొవిడ్-19తో తాజాగా 12 మంది మృత్యువాతపడ్డారు.
అదేవిధంగా 1280 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,16,688కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,462గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటివరకు మొత్తం 3,598 మంది చనిపోయారు.
ఇకపోతే, రాష్ట్రంలోని జిల్లా వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 59, జీహెచ్ఎంసీ 129, జగిత్యాల 23, జనగాం 11, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులాంబ గద్వాల 7, కామారెడ్డి 3, కరీంనగర్ 69, ఖమ్మం 69, కొమురంభీం ఆసిఫాబాద్ 6, మహబూబ్‌నగర్ 23, మహబూబాబాద్ 44 చొప్పున నమోదయ్యాయి.