Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింకలో కనిపించిన యాంటీబాడీలు.. సైంటిస్టుల ఆందోళన

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (22:28 IST)
కరోనా మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైందా అనే అనుమానం తలెత్తింది సైంటిస్టులకు. జూ పార్క్‌లో ఉన్న పులికి.. అంటూ అక్కడక్కడ కేసులు బయటపడ్డా ఇప్పుడు అడవుల్లో తిరిగే జంతువుల్లోనూ కనిపిస్తున్నాయి. దానికి సాక్ష్యంగా నిలిచాయి జింకలో కనిపించిన యాంటీబాడీలు. మిచిగాన్, పెన్సీల్వేనియా, న్యూయార్క్, ఇల్లినాయీస్ ప్రాంతాల నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేశారు. 
 
ఆ శాంపుల్స్ ను బట్టి నమోదైన యాంటీబాడీలు కొవిడ్ నుంచి రికవరీ అవడం వల్లనే నమోదయ్యాయని తెలిసింది. మిగతా జింకలకు కూడా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని యూస్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ హెచ్చరిస్తుంది.
 
కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైన సమయంలో ఈ శాంపుల్స్ ను విశ్లేషించిన రీసెర్చర్లు.. తొలిసారి అడవి జంతువులో వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో సెర్చింగ్ మొదలుపెట్టారు. సెరో సర్వేలెనస్ వాడి ఆ జంతువును కనుగొనగా.. తెల్ల తోక ఉన్న జింకలో కొవిడ్ యాంటీబాడీలు కనిపించాయి. 40శాతం శాంపుల్స్ లో ఇదే ఫలితం వచ్చింది… ఆ జింకకు SARS-CoV2వచ్చి తగ్గి ఉండొచ్చని చెబుతున్నారు రీసెర్చర్లు.
  
గతంలో ల్యాబొరేటరీ ప్రయోగాల్లో జింక నుంచి ఇతర వాటికి వైరస్ వ్యాప్తి చెందింది. అంతేకాకుండా మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. మనుషులంతా వ్యాక్సినేషన్ చేయించుకున్నా అక్కడి జంతువుల్లో వైరస్ సజీవంగానే ఉంటుంది. ఫలితం ఇతర జీవాలకు కూడా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments