Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవాగ్జిన్ టీకాతో 14 రకాల సైడ్ ఎఫెక్ట్.. దద్దుర్లు, నీరసం, వికారం..?

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (11:35 IST)
కోవాగ్జిన్ కరోనా టీకాతో 14 రకాల సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హైదారబాద్ కు చెందిన తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. టీకా తీసుకొనే ముందు…కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్దిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని సూచించింది. అలర్జీలు, రక్తస్త్రావం సమస్యలు, బ్లడ్ థిన్నర్ లు వాడుతున్న వారు, జ్వరంతో ఉన్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారు కోవాగ్జిన్ టీకాలు తీసుకోకపోవడమే మంచిదని వెల్లడించింది.
 
టీకా తీసుకోవాలని కేంద్రం నుంచి సందేశాలు అందుకున్న వారు.. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంటూ..ఐదు పేజీల కోవాగ్జిన్ టీకా ఫ్యాక్ట్ షీట్ ను భారత్ బయోటెక్ తాజాగా విడుదల చేసింది. టీకా తీసుకున్న కొందరిలో సాధారణంగా..14 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిపింది. తలనొప్పి, ఒళ్లునొప్పులు, దద్దుర్లు, నీరసం, వికారం, వాంతులు, జ్వరం, ఇంజెక్షన్‌ వేసినచోట నొప్పి, ఎర్రబారడం, దురద, వాపు వంటివి ఉంటాయని తెలిపింది. 
 
ఇంజక్షన్ వేసిన చోట..పై భాగం బిగుతుగా..తయారవుతుందని, కొందరిలో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఐదు రకాల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, మైకంతో కూడిన నీరసం, గుండె కొట్టుకొనే వేగం పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం, ముఖంపై, గొంతులో వాపు రావడం ఏర్పడడం జరుగుతుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments