Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవాగ్జిన్‌తో 14 రకాల సైడ్‌ఎఫెక్ట్స్! ఇవి ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది...

Advertiesment
కోవాగ్జిన్‌తో 14 రకాల సైడ్‌ఎఫెక్ట్స్! ఇవి ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది...
, బుధవారం, 20 జనవరి 2021 (09:30 IST)
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకుంటే 14 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో ఐదు రకాలైన సీరియస్ రియాక్షన్లు సంభవించే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. 
 
టీకా తీసుకునే ముందు కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్ధిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని, కొన్ని రకాల అలర్జీలు, రక్తస్రావం సమస్యలు, జ్వరంతో ఉన్నవాళ్లు, బ్లడ్‌ థిన్నర్‌లు (రక్తాన్ని పలుచ బరిచే మందులు) వాడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారు.. కోవాగ్జిన్‌ టీకాను తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. 
 
ప్రధానంగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాలను కోవిడ్ యోధులకు ఇస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సందేశం పంపుతుంది. అలా సందేశం వచ్చిన వారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని భారత్ బయోటెక్ కోరుతుంది. 
 
ఈ మేరకు ఐదు పేజీలతో కోవాగ్జిన్‌ టీకా ఫ్యాక్ట్‌షీట్‌ను భారత్‌ బయోటెక్‌ తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకునే ముందు కేంద్రంలో కోవాగ్జిన్‌పై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించింది. అనంతరం వేసుకోవాలా? లేదా? అనేది లబ్దిదారుల ఇష్టమేనని స్పష్టం చేసింది. టీకా వేసుకోవడానికి లేదా తిరస్కరించడానికి కూడా లబ్దిదారుడికి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. 
 
కోవాగ్జిన్ టీకా వేయించుకోదలచినవారు.. ఖచ్చితంగా తాము వాడుతున్న రెగ్యులర్ మందుల వివరాలు వెల్లడించాల్సివుంది. ముఖ్యంగా, ఏమైనా రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారా? దేనికోసం వాడుతున్నారు? ఆయా వివరాలను విధిగా చెప్పాల్సివుంటుంది. అలాగే, ఇంతకుముందు ఏమైనా అలర్జీలు ఉన్నాయా? జ్వరంతో బాధపడుతున్నారా?
 
మహిళలు అయితే, రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? బ్లడ్‌ థిన్నర్‌ మందులు వాడుతున్నారా? రోగ నిరోధక శక్తికి సంబంధించి సమస్యలున్నాయా? గర్భందాల్చివున్నారా? చంటిపిల్లలకు పాలు ఇస్తున్నారా? ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? అనే విషయాలను వ్యాక్సిన్ వేయించుకునే ముందు వెల్లడించాల్సివుటుందని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ ఎత్తరా.. మగాడివైతే.. చర్చకు రా : నోరు పారేసుకున్న మంత్రి కొడాలి నాని