మన దేశంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు, పకడ్బంధీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ... కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో గత 24 గంటల్లో 1035 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి 40 మంది చనిపోయారు.
అలాగే, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, గుజరాత్‌లో 19 మంది మరణించారు.