Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్ర-తెలంగాణలో ఆగని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, ఎపిలో 381-తెలంగాణలో 487

ఆంధ్ర-తెలంగాణలో ఆగని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, ఎపిలో 381-తెలంగాణలో 487
, శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (23:01 IST)
కరోనా వైరస్ వ్యాప్తి ఆగటంలేదు. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తూ వుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనావైరస్ (కోవిడ్ -19) కేసులు వరుసగా 381, 487కు పెరిగాయి. కరోనా వైరసుకి అడ్డుకట్ట వేసేందుకు ఏపి ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాలలో 133 క్లస్టర్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు.
 
నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న దృష్ట్యా అక్కడే ఫోకస్ ఎక్కువ పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఇద్దరు వైద్యులకు, మరో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కరోనా వైరస్ సంక్రమించింది. దీనితో మరిన్ని ఆంక్షలు విధించారు అధికారులు. ద్వితీయ దశకు వెళ్లకుండా ఛేదించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకుగాను ఏప్రిల్ 15 తర్వాత కనీసం రెండు వారాలైనా లాకవుట్ అవసరమవుతుందని అధికారి తెలిపారు.
 
తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం సమావేశమై రాష్ట్ర పరిస్థితిని సమీక్షించారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులకు అవసరమైన సామాగ్రి లభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. తెలంగాణలో ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జ్ కాగా, 12 మంది మరణించారు. ఏపీలో 10 మంది రోగులు వైరస్ నుండి కోలుకున్నారు.
 
గత నెలలో న్యూల్లీలోని మార్కాజ్ నిజాముద్దీన్లో పాల్గొన్నవారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 1,500 మందికి పైగా వున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. వారిలో అధికులు వైరస్ బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించాలంటే లాక్డౌన్ కనీసం రెండు వారాలు పొడిగించాలని ఇరు రాష్ట్రాల అధికారులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు వెంటిలేటర్ తీసేస్తే.. నర్సులు డ్యాన్స్ చేస్తారు..