Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నెగటివ్ సర్టిఫికేట్ వుంటేనే రండి.. లేకుంటే పొండి..?

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:21 IST)
Goa
గోవాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 15 రోజుల లాక్‌డౌన్ కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో పాటు.. రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేయాలని విపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
 
గోవా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత దిగంబర్ కామత్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశంలో గోవా ఫార్వార్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కూడా పాల్గొన్నాయి. ''రాష్ట్ర ప్రభుత్వం గోవాలో 15 రోజుల లాక్‌డౌన్‌కు ఆదేశించాలి. 
 
లాక్‌డౌన్ సమయంలో పొరుగు రాష్ట్రాల సరిహద్దులను కూడా మూసివేయాలి. నిత్యావసర వస్తువులు, మందులు, వైద్య సామగ్రిని తరలించే వాహనాలు, ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతించాలి...'' అని తీర్మానంలో పేర్కొన్నారు. 
 
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక సిబ్బందితో ప్రమోద్ సావంత్ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దీంతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్లు, వ్యాక్సీన్లు, బెడ్‌ల లభ్యతపై ''శ్వేత పత్రం'' విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 
 
కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతించాలని విపక్ష నేతలు ప్రభుత్వానికి సూచించారు. కాగా గోవా ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్ 29 రాత్రి నుంచి మే 3 ఉదయం వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీన్ని ఈ నెల 10 వరకు పొడిగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments