Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 13,216 మందికి పాజిటివ్

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (12:04 IST)
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటివరకు 1,96,00,42,768 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,216మంది కరోనా బారినపడ్డారు. వైరస్ కారణంగా మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108కు చేరింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 2.73శాతానికి పెరిగింది. 
 
దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలోనే ఉన్నాయి. కేరళలో 3వేల 253 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 1797 కేసులు, ఒక్క ముంబై మహానగరంలోనే 2 వేల 255 కేసులు నమోదయ్యాయి. 
 
గడచిన 24 గంటల్లో కరోనా సోకిన వారిలో 23 మంది కోలుకోలేక చనిపోగా... ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 5 లక్షల 24వేల 840కు చేరింది. 

సంబంధిత వార్తలు

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments