Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బాధితులకు శుభవార్త... ఏంటది?

Webdunia
శనివారం, 15 మే 2021 (19:03 IST)
Dr.Reddys
కోవిడ్ బాధితులకు శుభవార్త. కోవిడ్‌ బాధితుల కోసం డీఆర్‌డీఓతో కలిసి డాక్టర్‌ రెడ్డీస్‌ తయారు చేస్తున్న 2- డీజీ (2- డీయోగ్జీ- డి- గ్లూకోజ్‌) ఔషధం వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఈ ఔషధ తయారీ మొదలుపెట్టామని, జూన్‌లో దేశీయ విపణిలోకి విడుదల చేస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది.
 
కోవిడ్‌-19 రోగులకు ఈ ఔషధాన్ని ఇస్తే, వారిలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోకుండా నివారించడంతో పాటు వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని డీఆర్‌డీఓ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 
 
దీనిపై నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో దీన్ని విడుదల చేయడానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. దీంతో తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌ చర్యలు తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments