Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశలు రేపుతున్న 'కరోనా' యాంటీ వైరల్ మెడిసిన్ ... చికాగోలో రోగులకు చికిత్స?!

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (15:01 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ కనిపెట్టింది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే చికాగాలోని కరోనా రోగులపై ప్రయోగించారు. మొత్తం 113 మంది రోగులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా వారంతా కేవలం వారం రోజుల్లో పూర్తిగా కోలుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. అయితే, మరికొన్ని దశల్లో ప్రయోగాలు, పరీక్షలు చేయాల్సివున్నందున మే మొదటివారంలో ఈ వ్యాక్సిన్‌పై అధికారికంగా ప్రకటన చేస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఇంతకీ కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ కనిపెట్టిన కంపెనీ పేరు గిలియెడ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ. అమెరికాలో మందుల తయారీ కంపెనీల్లో ఇదొకటి. ఈ కంపెనీ కరోనా రోగాన్ని నయం చేసేందుకు ఓ చికిత్సా విధానాన్ని కనిపెట్టింది. 
 
మూడో దశలో ఉన్న కరోనా పాజిటివ్ రోగులపై ఈ కంపెనీ జరిపిన ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఇపుడు అందరి దృష్టి ఈ కంపెనీ మందుపై కేంద్రీకృతమైంది. అయితే, దీనిపై ఆ సంస్థ మరిన్ని పరిశోధనలు చేస్తోంది. ఓ చికిత్స పద్ధతిని అమెరికాలోని కరోనా రోగులపై ఆ సంస్థ ప్రయోగించగా వారిలో అత్యధిక మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
 
ఆ చికిత్సా విధానంతో కొవిడ్‌-19 రోగులకు జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు అతి వేగంగా తగ్గాయి. రోగులు త్వరితగతిన కోలుకుంటున్నారు. ఈ చికిత్స పద్ధతిలో చికిత్స తీసుకున్న వారంతా వారం రోజుల లోపే కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటికి తాము చేసిన ప్రయోగ పరీక్షలను మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 
 
ముఖ్యంగా, కరోనాతో అధికంగా ఉన్న స్టేజ్‌-3 రోగులపై చేసిన ప్రయోగ పరీక్షల ఫలితాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పింది. ఈ వివరాలన్నీ మే మొదటి వారంలో వస్తాయని, ఆ తర్వాతే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పూర్తిగా అధ్యయనం చేసేంతవరకు ఈ చికిత్స పనిచేస్తుందని ప్రకటన చేయలేమని ఆ సంస్థ తెలిపింది. 
 
తమ చికిత్సకు మంచి స్పందన వస్తూ పెద్ద సంఖ్యలో అతి త్వరగా రోగులు కోలుకుంటుండంతో గిలియెడ్‌ అమెరికాలోని 152 ప్రాంతాల్లో ప్రయోగ పరీక్షలు జరుపుతోంది. చికాగో వర్సిటీ ఆసుపత్రిలోనూ ఈ ప్రయోగ పరీక్షలు జరుపుతోంది. ఇప్పటికే 113 మందిని ప్రయోగ పరీక్షల కోసం ఆ ఆసుపత్రిలో చేరగా, వారందరికీ కరోనా పూర్తిగా తగ్గిపోయింది. 
 
చికాగోలో పెద్ద ఎత్తున రోగులు కోలుకోవడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఆ సంస్థ పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రపంచంలోని మార్కెట్లన్నీ దానివైపే చూస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లోనూ ఆ సంస్థ షేర్లు భారీగా పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments