Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కరోనా వైరస్ కల్లోలం, 24 గంటల్లో 1,438 మందికి పాజిటివ్

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (11:10 IST)
తమిళనాడులో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో కోవిడ్ -19కు 1,438 మంది రోగులు పాజిటివ్ అని తేలింది. ఇదే ఇప్పటివరకూ అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. విజయ బాస్కర్ తెలిపారు.
 
రాష్ట్రం ఇప్పటివరకు నమోదు చేసిన అత్యధిక సింగిల్-డే స్పైక్ ఇది. రెండవ అతిపెద్ద రోజువారీ సంఖ్యలు చూస్తే, నిన్న 1,384 కేసులు కాగా ఈ రోజు అది 1438గా నమోదయ్యాయి. వీటితో తమిళనాడులో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 28,694కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.
 
గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 12 మరణాలు సంభవించడంతో మరణాల సంఖ్య కూడా 232కు పెరిగింది. నమోదైన కొత్త కేసులలో, తమిళనాడు చేరుకున్న 12 మంది రోగులు (దుబాయ్ నుండి 5, ఖతార్ నుండి 6, శ్రీలంక నుండి ఒకరు) రాష్ట్రంలో పాజిటివ్ కేసుల్లోనివారు.
 
ప్రస్తుతం 12,697 క్రియాశీల కేసులు వుండగా, 15,762 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో 861 మంది రోగులు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 17,815 మంది రోగులు పురుషులు, 10,862 మంది మహిళలు, 17 మంది లింగమార్పిడి రోగులు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 74 పనిచేస్తున్న కోవిడ్ -19 పరీక్షా సదుపాయాలు ఉన్నాయి, వాటిలో 30 ప్రైవేటు, మిగిలినవి ప్రభుత్వానికి చెందినవి.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments