దేశంలో 55 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (11:24 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో మరో 75083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5562664కు పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
అలాగే, గ‌త 24 గంట‌ల సమయంలో 1,053 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 88,935కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 44,97,868 మంది కోలుకున్నారు. 9,75,861 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,53,25,779 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇకపోతే, తెలంగాణ‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,166 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,143 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,44,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,052కు చేరింది. ప్రస్తుతం 29,649 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 309, రంగారెడ్డి జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments