ఆంధ్రాలో కరోనా వైరస్ రక్కసి : కొత్తగా 8 వేల పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (17:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రక్కసి కొనసాగుతోంది. ఈ కారణంగా గడచిన 24 గంటల్లో 8,601 పాజిటివ్ కేసులు రాగా, 86 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712కి చేరగా, కరోనా మృతుల సంఖ్య 3,368కి పెరిగింది.
 
తాజాగా 8,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఈ మహమ్మారి వైరస్ నుంచి విముక్తులైన వారి సంఖ్య 2,68,828గా నమోదైంది. ప్రస్తుతం 89,516 మంది చికిత్స పొందుతున్నారు.
 
తెలంగాణాలనూ అంతే... 
అలాగే, తెలంగాణలో కొవిడ్-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,842 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదేసమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1825 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. ఆస్పత్రుల్లో 22,919 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 82,411 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 761కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 373 మందికి కొత్తగా కరోనా సోకింది.
 
దేశ వ్యాప్తంగా 61 వేల పాజిటివ్ కేసులు 
భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. అదేసమయంలో 836 మంది మృతి చెందారని, 57,468 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,06,349 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 57,542కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 23,38,036 మంది కోలుకున్నారు.
                                     
కాగా, దేశంలో ఆదివారం వరకు మొత్తం 3,59,02,137 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజులోనే  6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments