Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్: కోవిడ్ నెయిల్స్ ఎలా వుంటాయో చూడండి

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (20:05 IST)
కరోనావైరస్‌కి సంబంధించి ప్రతిరోజూ కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్‌లో చాలా మార్పులు కనిపించాయి. కరోనావైరస్ సోకిన రోగులలో కూడా కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు, జ్వరం, దగ్గు, అలసట, రుచి, వాసన స్వభావం కోల్పోవడం కరోనా ప్రధాన లక్షణంగా పరిగణించబడుతుంది.
 
గోళ్ళతో కూడా కరోనా వైరస్‌ను గుర్తించవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. కొంతమంది కరోనా సోకిన రోగుల గోర్లు రంగులు తేలికగా మారుతాయి.
 
కొన్నివారాల తరువాత, వాటి పరిమాణం కూడా మారడం ప్రారంభిస్తుంది. వీటిని 'కోవిడ్ నెయిల్స్' అంటారు. అయినప్పటికీ, గోళ్ళతో సంబంధం ఉన్న కరోనా యొక్క లక్షణాలు చాలా తక్కువ కేసులే వున్నాయి.
 
గోళ్ళపై ఎర్రటి అర్ధచంద్రాకార ఆకారం కనిపించడం ముఖ్యంగా కరోనా బారిన పడటానికి సంకేతం. ఈ రకమైన ఆకారం సాధారణంగా గోళ్ళపై చాలా అరుదుగా ఉంటుంది, కానీ గోరు ప్రారంభానికి చాలా దగ్గరగా అలాంటి ఆకారాన్ని చూస్తే అజాగ్రత్తగా ఉండకూడదు.
 
ఇటీవల, జో కోవిడ్ స్టడీ సెంటర్ ముఖ్య పరిశోధకుడు టిమ్ స్పెక్టర్ కోవిడ్ నెయిల్స్‌ను గుర్తించి ఫోటోను ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అతను ఇలా రాశాడు - మీ గోర్లు వింతగా కనిపిస్తున్నాయా? పెద్ద సంఖ్యలో కోవిడ్ గోర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఇది రోగులకు ఎటువంటి సమస్యను కలిగించదు అని.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments