Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరెస్ట్‌ను తాకిన కరోనా వైరస్.. పాజిటివ్ లక్షణాలు కలిగిన వ్యక్తిని..?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (13:27 IST)
Everest
భారత్‌లో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అత్యున్నత శిఖరమైన ఎవరెస్టు పైన కూడా పడింది. నేపాల్‌లోని ఈ శిఖరానికి కూడా ఇది ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఈ శిఖర బేస్ క్యాంపులో కనుగొన్నారు. ఆ వ్యక్తిని హెలికాప్టర్‌లో ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్టు పర్వతంపైకి ఈ వైరస్' 'చేరుకోవడం' అత్యంత ఆశ్చర్యకరం, దారుణం కూడా అంటున్నారు. 
 
అయితే ఎత్తయిన పర్వతాలను ఎక్కుతున్నప్పుడు కొంతమందికి 'పల్మనరీ ఎడిమా' అనే లక్షణాలు, సిక్ నెస్ కనబడుతాయట. నిజానికి ముగ్గురు పర్వతారోహకులకు కోవిడ్ పాజిటివ్ సోకిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వీరిని వెంటనే బేస్ క్యాంపు నుంచి తరలించినట్టు పేర్కొంది.
 
2019లో 11 మంది పర్వతారోహకులు మరణించారు. కాగా- చాలా వరకు వైరస్ లక్షణాలు ఆల్టిట్యుడ్ సిక్ నెస్‌ని, సాధారణంగా పర్వతారోహకులను వేధించే 'కుంభ్ దగ్గును' పోలి ఉంటాయని అంటున్నారు. నేపాల్‌లో సైతం కేసులు పెరిగిపోతున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ఈ కేసులు పెరగకుండా ముందు జాగత్త చర్యలు తీసుకుంటోంది. ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియడంలేదని, చాలానే ఉంటాయని భావిస్తున్నామని ఓ సాహస యాత్రా బృంద నేత ఒకరు అన్నారు. 
 
నేపాల్‌లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ యాత్రా బృందం ఈసారి తమ ఎవరెస్టు పర్వతారోహణ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. అయితే నేపాల్ టూరిజం శాఖ మాత్రం పలువురు విదేశీ పర్వతారోహకులకు పర్మిట్లు ఇచ్చింది. దాదాపు 377 మందికి అనుమతి లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments