Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలి వాతావరణంలో మరింతగా విజృంభించనున్న కరోనా

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (13:16 IST)
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా మున్ముందు మరింత విశ్వరూపాన్ని చూపే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. చలి పొడి వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. పైగా, గాలిలో తేమ తగ్గినట్టయినా కూడా ముప్పేనని హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో చలికాలంలో సూర్యరశ్మి సరిగా అందకపోవడం కూడా ఈ వైరస్ ప్రతాపం చూపించేందుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. 
 
కాగా, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ వైరస్ చలికాలంలో మరింత చెలరేగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిగతా శ్వాసకోస వైరస్‌లలా కాకుండా, చలికాలంలో ఇది మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణురాలు డాక్టర్ రిచా సరీన్ తెలిపారు.
 
చలి, పొడి వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందన్నారు. గాలిలో తేమ తగ్గినా కూడా వైరస్ ముప్పు ఎక్కువవుతుందని సరీన్ పేర్కొన్నారు. సాధారణంగా చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి సరిపడా అందదని, ఫలితంగా డి విటమిన్ స్థాయులు తగ్గిపోతాయని వివరించారు. ఈ కారణంగా శరీరంలోని రోగ నిరోధకశక్తి మరింతగా తగ్గడంతో వైరస్ ముప్పు పెరుగుతుందని డాక్టర్ రిచా సరీన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments