Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (17:23 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ నమోదయ్యే కొత్త కేసుల్లో ఈ పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కూడా ఈ పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,016 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. అంటే, దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతేడాది అక్టోబరు 2వ తేదీన 3,375 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 
 
తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692కి చేరింది. కాగా బుధవారంతో పోలిస్తే కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశంలో రోజూవారీ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments