Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా బీభత్సం - రాత్రి కర్ఫ్యూ - వారాంతాల్లో లాక్డౌన్

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (20:13 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఒక్క మహారాష్టరోనే 70 శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 
 
ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. 
 
అంతేగాకుండా వారాంతాల్లోనూ లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటన చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ఐదుగురు, అంతకుమించి గుమికూడరాదని తెలిపింది.
 
ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొంది. 
 
ప్రజా రవాణా వాహనాలను 50 శాతం సామర్థ్యంతోనే తిప్పాలని స్పష్టం చేసింది. హోటళ్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా పగటివేళల్లోనే ఫుడ్ డెలివరీలకు అనుమతి ఇచ్చింది. త్వరలోనే పరిస్థితిని సమీక్షించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 
 
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు 
 
మరోవైపు, ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గడచిన 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహంచగా 1,730 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
చిత్తూరు జిల్లాలో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 164 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 10 కేసులు నమోదయ్యాయి.
 
అదేసమయంలో 842 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,07,676 మందికి కరోనా సోకగా, వారిలో 8,90,137 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,300 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,239కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments