Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ కొరఢా.. మాస్క్ ధరించలేదో రూ.1000 అపరాధం.. ఎక్కడ?

Advertiesment
కోవిడ్ కొరఢా.. మాస్క్ ధరించలేదో రూ.1000 అపరాధం.. ఎక్కడ?
, ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (14:56 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తారా స్థాయికి చేరింది. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా, దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. అయితే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టే ప్రయాణికుల వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 
 
దీంతో విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. 
 
ఈ జరిమానా విధించడం ముంబై విమానాశ్రయంలో ప్రారంభించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) దీనికి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది.
 
కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు తప్పనిసరి కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. విమానాశ్రయ ప్రాంగణంలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు జరిమానా విధించాలని రెగ్యులేటర్ పేర్కొంది.
 
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డీజీసీఏ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఒక ప్రయాణికుడు మాస్క్‌ ధరించకున్నా, ఇతర కోవిడ్‌ నిబంధనలు పాటించకున్నా.. రూ.1000 జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
 
కాగా, శనివారం ముంబైలో 9,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 5,322 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో మరణించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 49,447 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 277 మంది ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులకు చిల్లర నాణేల రూపంలో వేతనాలు.. ఎక్కడ?