Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ధనవంతులనే కాటేస్తుంది ... తమిళనాడు సీఎం

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్ వ్యాధి కేవలం ధనవంతుల వ్యాధి అని, ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆయన స్పందిస్తూ, ఈ కరోనా వైరస్‌ను ధనవంతులే రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పైగా, ఈ వైరస్ ధనవంతులకే సోకుతుందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిచన వారి ద్వారానే ఈ వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని ఆయని చెప్పుకొచ్చారు. 
 
అలాగే, ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
 
కాగా, తమిళనాడులో గురువారం కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments