అమెరికాలో అల్లకల్లోలం... 24 గంటల్లో పది వేల కరోనా కేసులు

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (08:22 IST)
కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైపోతోంది. కేవలం గడిచిన 24 గంటల్లోనే కొత్తగా పది వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అమెరికాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 49594కు చేరింది. మంగళవారం ఒక్క రోజే 130 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 622కి చేరుకుంది. దీంతో అమెరికా ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 16,961 మంది మరణించగా, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 4 లక్షలను దాటింది.
 
మరోవాపు, ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. వైద్యరంగానికి చెందిన నిపుణులతో పాటు... తన అధికార యంత్రాంగంలోని కీలక నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో మాస్క్‌లు, శానిటైజర్లు ఇతర మందులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
అలాగే, వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న న్యూయార్క్‌ ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అమెరికాలో వైరస్ బారినపడిన ప్రతి ఇద్దరిలో ఒకరు న్యూయార్క్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ మహానగరంలో 24 గంటల వ్యవధిలో 5,085 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
న్యూయార్క్‌ సిటీ, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‌ ఐలాండ్‌ తదితర ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమంది జనాభాలో ఒకరికి వ్యాధి సోకిందని వైట్‌ హౌస్‌ కరోనా టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్ డెబ్రా ఎల్‌ బ్రిక్స్‌ తెలిపారు. ఈ ప్రాంతానికి తగినన్ని మందులు, ఇతర పరికరాలను పంపిస్తున్నామని డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

ఎర్రచీర లోని ఓ షాట్‌ను అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా లో కాపీ కొట్టారు : సుమన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments