Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటును వెంటాడుతున్న కరోనావైరస్, స్పీకర్‌ను సెలవు కోరిన పలువురు సభ్యులు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (15:48 IST)
దేశ చరిత్రలోనే అత్యంత ప్రత్యేక పరిస్థితులు నడుమ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల మధ్య, అనేక జాగ్రత్తల మధ్య జరుగుతున్న ఈ సమావేశాల కోసం అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
 
కాగా సెప్టెంబరు 12న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు ముందే లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 17మంది లోక్ సభ, 8మంది రాజ్యసభ ఎంపీలకు వైరస్ సోకినట్లు నిర్థారణయ్యింది. రాజ్యసభ ఎంపీలు సెలవు కోరుతున్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
 
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 14 మంది ఎంపీలు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తమకు సెలవులు ఇవ్వాలంటూ ఎంపీలు దరఖాస్తులో కోరారు. కాగా కోవిడ్ 19 విసృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీలు సెలవు కోరినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments