Webdunia - Bharat's app for daily news and videos

Install App

#చికెన్ కరోనా దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ విలవిల... రూ.40కే కేజీ

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (21:04 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ ఏకంగా 113 దేశాలకు వ్యాపించింది. అలాగే, లక్షా 15 వేల మందికి ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ బారినపడి కోలుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4072గా ఉంది. ఇది మంగళవారానికి అందిన లెక్క. అయితే, ఈ కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ఇలాంటి వాటిలో పౌల్ట్రీ రంగం కూడా ఒకటి. 
 
ఈ పరిశ్రమ భారత్‌లో మరింతగా దెబ్బతింది. చికెన్ ఆరగిస్తే కరోనా వైరస్ సోకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చికెన్ కొనేవారే కరువయ్యారు. ఫలితంగా చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.30 నుంచి రూ.40 పలుకుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ఇటీవల చికెన్ తింటే కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అది నిజం కాదని స్వయంగా ప్రభుత్వాలే అధికారికంగా ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ.. ప్రజల్లో ఉన్న భయాన్ని మాత్రం ఈ ప్రకటనలు పోగొట్టలేకపోయాయి. ఫలితంగా చికెన్ విక్రయాలు దారుణంగా పడిపోయాయి.
 
దీంతో నష్టాల్లో కూరుకుపోతున్న వ్యాపారులు ధరలను దారుణంగా తగ్గించి విక్రయిస్తున్నారు. అయినా, విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు. తాజాగా, కర్నూలు జిల్లాలో కిలో చికెన్ ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.40కు పడిపోయింది. జిల్లాలోని గూడూరు పంచాయతీ పరిధిలోని ఓ వ్యాపారి ఈ మేరకు దుకాణం ముందు బోర్డులు పెట్టి మరీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments